![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -415 లో....పంతులు గారు తీసుకొని వచ్చిన అక్షింతలు అందరు భర్తలు తీసుకొని తమ భార్యలని ఆశీర్వదిస్తారు. రాజ్ కావ్యని ఆశీర్వదిస్తుండగా.. రాజ్ ఏమైనా ఏకాపత్ని వ్రతుడా అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య స్వప్న ఇద్దరు రుద్రాణికి మంచి కౌంటర్ ఇస్తారు. నా భర్త ఎప్పటికి నాకు శ్రీరామచంద్రుడే అని కావ్య అని రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత అనామిక అక్షింతలు తీసుకొని బయట కవితలు రాసుకుంటున్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. నన్ను ఆశీర్వాదించండి అని అనామిక అనగాన.. కళ్యాణ్ తనని తిట్టి ఆశీర్వదించకుండా వెళ్ళిపోతాడు.
అదంతా చూసిన కావ్య.. లోపలికి వచ్చిన కళ్యాణ్ తో మాట్లాడుతుంది. నీ చదువు సంస్కారం జ్ఞానం ఏమైపోయిందో అర్ధం కావడం లేదు.. భార్య ఏదో తప్పు చేసిందని అలా మాట్లాడుతావా మార్చుకోవాలి కదా అంటూ కళ్యాణ్ కి కావ్య క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత అప్పు మాయ అడ్రెస్ చెప్పి కావ్యని రమ్మని చెప్తుంది. ఇద్దరు కలిసి మాయ ఉన్న ఇంటికి వెళ్తారు. డోర్ కొట్టగానే మాయ తీస్తుంది. కావ్య అప్పుని చూసి భయపడుతూ డోర్ వేస్తుంటే అప్పు డోర్ తోసుకంటూ లోపలికి వెళ్తుంది. మమల్ని చూసి బయపడుతుంటే మేం ఎవరో తెలుసు అన్నమాట అని కావ్య అంటుంది. నిజం చెప్పు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావని కావ్య అడుగుతుంది. నాకేం తెలియదు కావ్య అని మాయ అనగానే.. నా పేరు కూడ తెలుసా అని కావ్య అంటుంది. కావ్య అప్పు ఇద్దరు మాయని బెదిరిస్తారు. నిజం చెప్పకుంటే పోలీసులకి పట్టిస్తామని కావ్య అంటుంది. దాంతో బయపడిన మాయ. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని చెప్తుంది. నీ వల్ల అక్కడ మా అయనని తక్కువ చేసి చూస్తున్నారు.. మా కుటుంబం ముక్కలు అయ్యేలా ఉందని కావ్య అంటుంది.
నువ్వు ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా అత్తయ్య గారితో ఈ బాబుకి మా అయనకి ఏం సంబంధం లేదని చెప్పమని మాయని కావ్య బెదిరిస్తుంది. దాంతో మాయ చెప్తానంటుంది. మరొకవైపు ఆ బాబు తల్లిని తీసుకొని వస్తానంటూ కావ్య వెళ్ళింది ఇంకా రాలేదని అపర్ణ అంటుంది. ఓడిపోయి మొహం చెల్లక అటే వెళ్లిందేమోనని రుద్రాణి అనగానే. అలా ఎం చెయ్యను లేట్ అయిన సరే పని పూర్తి చేసుకొని వస్తానని కావ్య అంటుంది. రా మాయ అని కావ్య పిలవగానే మాయ వస్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో నువ్వు చేసిన పని గురించి చెప్పమని కావ్య అనగానే.. ఆ బాబు తల్లిని నేనే అని మాయ అంటుంది. మరి తండ్రి ఎవరు అని రుద్రాణి అడుగుతుంది. రాజ్ అంటూ తన వైపు చూపించిగానే కావ్యతో పాటు అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |